జపాన్‌పై ప్రేమతో.. తన కొత్త స్నేహితులను పరిచయం చేసిన ఎన్టీఆర్
- అసాహి, యూహీ అనే తన కొత్త పెంపుడు పక్షులను పరిచయం చేసిన ఎన్టీఆర్
- జపాన్‌పై తనకున్న ప్రేమకు గుర్తుగా వాటికి ఆ పేర్లు పెట్టినట్లు వెల్లడి
- గతంలో 'ఆర్ఆర్ఆర్' చూసి ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకోవడం కదిలించిందని వ్యాఖ్య
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్న తారక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజున అభిమానులకు ఓ ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. తన ఇంట్లోకి కొత్తగా వచ్చి చేరిన ఇద్దరు స్నేహితులను ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేశారు. అవి రెండు అందమైన పక్షులు. వాటికి 'అసాహి', 'యూహీ' అని నామకరణం చేశారు. ఈ పేర్లు జపాన్‌పై తనకున్న ప్రేమకు ప్రతిబింబం అని తారక్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చిలో 'దేవర: పార్ట్ 1' సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడి అభిమానులు చూపిన అపూర్వ ఆదరణకు ఆయన ఫిదా అయ్యారు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసి ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకున్నారని తెలిసి ఎంతో కదిలిపోయానని అప్పట్లో ఓ వీడియోలో పంచుకున్నారు. 2022లో 'ఆర్ఆర్ఆర్' చిత్రం జపాన్‌లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
ఇక సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం 'డ్రాగన్'తో రాబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో గ్లోబల్ ఓపియం యుద్ధం నేపథ్యంలో సాగే కథలో, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన ప్రధాన హంతకుడి (అసాసిన్) పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు.